Header Banner

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

  Wed Feb 12, 2025 12:51        Politics

సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణకు హైదరాబాద్ ఉండటంతో.. రెవెన్యూ పరంగా ఆ రాష్ట్రానికి కొంత వెసులుబాటు వచ్చింది. దాంతో.. నెల నెలా వస్తున్న రెవెన్యూతో.. త్వరగా అభివృద్ధి చెందడానికి తెలంగాణకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ విభజనతో ఏపీ బాగా నష్టపోయింది. రెవెన్యూ వచ్చే నగరం ఏదీ లేదు. గత ఐదేళ్లుగా కేంద్రం సాయం చెయ్యలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విపరీతమైన పోటీని తట్టుకొని ముందుకెళ్లాలంటే.. ఏదైనా కొత్త ప్లాన్ ఉండాలి, కొత్త ఆలోచనలూ, ఆవిష్కరణలూ ఉండాలి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తు్న్నది అదే. కొత్తగా ఆలోచిస్తూ.. కొత్త నిర్ణయాలను అమల్లోకి తెస్తోంది. ఇటీవలే వాట్సాప్ సేవలు తెచ్చిన ప్రభుత్వం.. తాజాగా మహిళలకు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌పై ఫోకస్ పెట్టింది. దీనిపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక ట్వీట్ చేశారు.

"ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ప్రభుత్వం భారీగా వర్క్‌ ఫ్రమ్ హోమ్ విధానం కోసం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా మహిళల కోసం. ముందుగా.. సైన్స్‌లో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా.. STEMలోని మహిళలు, బాలికలందరికీ నేను నా శుభాకాంక్షలు చెబుతున్నాను. మనం మహిళలు, బాలికల విజయాల్ను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ రంగాల్లో వారికి సమాన, సంపూర్ణ వృద్ధి అవకాశాలు లభించేలా చెయ్యడానికి మనం కమిటెడ్‌గా ఉన్నాం" అని సీఎం చంద్రబాబు ట్వీట్‌లో తెలిపారు. "కరోనా సమయంలో పని చేసే విధానం మారింది. టెక్నాలజీ సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి ప్రాధాన్యం పెరిగింది. రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేసెస్ (CWS), నైబర్‌హుబ్ వర్క్ స్పేసెస్ (NWS) లాంటివి వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లి.. ఉద్యోగులు తమకు వీలైన విధంగా పనిచేసేలా చేశాయి. అలాంటివి మనం బెటర్‌గా వర్క్, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి సాయపడ్డాయి.

 

ఇది కూడా చదవండి: ఇళ్ల పట్టాల అక్రమాలపై కూటమి ప్రభుత్వం సీరియస్! పునర్విచారణకు రెవెన్యూ శాఖ సిద్దం!

 

మీరు ఈ విధానాలను ఏపీలో ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందులో భాగంగా తెస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ GCC పాలసీ 4.0 ఒక గేమ్ ఛేంజింగ్ స్టెప్ కాబోతోంది. ప్రతీ సిటీ, టౌన్, మండలంలో ఐటీ ఆఫీసులు ఏర్పాటు చేసుకునేలా.. మేము కంపెనీలకు రాయితీలు ఇస్తాం. తద్వారా క్షేత్ర స్థాయిలో IT లేదా GCC సంస్థలు ఉపాధి కల్పించేలా సపోర్ట్ చేస్తున్నాం" అని సీఎం చంద్రబాబు వివరించారు. "ఈ ప్రోత్సాహకాలు.. మంచి ఫలితాలు ఇస్తాయనే నమ్మకం నాకు ఉంది. ముఖ్యంగా మహిళా ప్రొఫెషనల్స్‌కి ఇవి బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నను. వీటి ద్వారా వారు.. ఇంటి నుంచే రిమోట్‌గా లేదా హైబ్రీడ్ వర్క్ చేసే ఆప్షన్స్ ఎంచుకోవచ్చు" అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇలాంటి వాటిని తెస్తున్నామని చెప్పే విషయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎప్పుడూ ముందే ఉంటారు. ఇలాంటి ఆలోచనలు, ఆవిష్కరణలూ మంచివే. కాకపోతే, వీటి ఫలితాలు వెంటనే కనిపించవు. ఇప్పుడు ప్రారంభిస్తే.. కనీసం ఐదేళ్ల తర్వాత గానీ ఫలితాలు కనిపించవు. అందులోనూ ఇప్పటివరకూ ఏపీలో ఐటీ పరిశ్రమలు పెద్దగా లేవు. పక్కనే ఐటీ కంపెనీలకు అన్ని సదుపాయాలూ కల్పిస్తున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఉన్నాయి.. వాటిని దాటుకొని ఏపీకి రావడానికి కంపెనీలు చాలా ఆలోచిస్తున్నాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల వాట్సాప్(Whats Up) ద్వారా ప్రభుత్వ సేవలు అందించడం కూడా ఒక మంచి ఇన్షియేటివ్ అనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, కంపెనీలు.. క్షేత్ర స్థాయికి వచ్చి, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ లభిస్తే అందరికీ ఆనందమే. మహిళల అభివృద్ధి మంచి సమాజానికి ప్రతీక కదా.

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో బెదిరింపు ఫోన్ కాల్‌ క‌ల‌క‌లం! ఫ్లైట్‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌దాడి?

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. జిల్లాల్లో పెరుగుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. రేటు తగ్గినా, గుడ్లు ఫ్రీ అన్న తినకండి!

 

మెగా డీఎస్సీపై ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌! ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు లేకుండా..

 

వైకాపా హయాంలో మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి! త్వరలో నిజాలు బహిరంగం.. కొల్లు రవీంద్ర!

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గుడ్​న్యూస్.. ఢిల్లీలో కుమారస్వామితో పురందేశ్వరి భేటీ!

 

హాస్పిటల్ బెడ్ పై యాంకర్ రష్మీ.. మళ్లీ తాను డ్యాన్స్.. ఆందోళనలో అభిమానులు..

 

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

 

ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

 

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

 

జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews